కలకలం: పోలవరం ప్రాజెక్టు వద్ద భూమిలో పగుళ్లు

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమిలో పగుళ్లు వచ్చాయి. స్పిల్ వే రెస్టారెంట్ దగ్గర ప్రధాన రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 05:08 AM IST
కలకలం: పోలవరం ప్రాజెక్టు వద్ద భూమిలో పగుళ్లు

Updated On : February 24, 2019 / 5:08 AM IST

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమిలో పగుళ్లు వచ్చాయి. స్పిల్ వే రెస్టారెంట్ దగ్గర ప్రధాన రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమిలో భారీగా పగుళ్లు వచ్చాయి. ప్రాజెక్టు స్పిల్ వే రెస్టారెంట్ దగ్గర ప్రధాన రోడ్డులో భూమి కంపించి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలవరం ప్రాజెక్ట్ వర్కర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం బయటపడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పగుళ్లు పడ్డ రోడ్డును పూడుస్తున్నారు.

గతంలోనూ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఇలానే పగుళ్లు రావడం కలకలం రేపింది. పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లే రోడ్డు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. రోడ్డంతా పెద్ద పెద్ద నెర్రెలు ఏర్పడ్డాయి. భూకంపం వచ్చిందని భావించిన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానిక ప్రజలు సైతం భయాందోళనకు గురయ్యారు. అయితే భూకంపం రాలేదని అధికారులు తేల్చడంతో రిలాక్స్ అయ్యారు.

ప్రాజెక్టు లోపల తవ్విన మట్టిని బయటకు తీసుకొచ్చి ఒక చోట డంపింగ్‌ చేయడం, దానిపైనే నిర్మాణాలు చేపట్టడం, కాలక్రమేణా భూమిలో మార్పులు సంభవించడం, ప్రాజెక్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో పేలుళ్లు జరిపినపుడు వదులుగా ఉన్న భూమి.. పగుళ్లు ఏర్పడటానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఇలానే దాదాపు ఒకటిన్న కిలోమీటర్ల తారు రోడ్డు మొత్తం తవ్వేసినట్లు పగుళ్లు ఏర్పడ్డాయి. అప్పుడే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటివి పునరావృతం కాకుండా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.