గురు శిష్యుల యుద్ధం: ధోనీ వర్సెస్ పంత్

గురు శిష్యుల యుద్ధం: ధోనీ వర్సెస్ పంత్

Updated On : March 26, 2019 / 11:59 AM IST

ఐపీఎల్ 2019లో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న పోరుకు సమయం ఆసన్నమైంది.  ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సొంతగడ్డపై సత్తా చాటాలని ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా సవాల్, ప్రతి సవాళ్లు విసురుకున్న పంత్.. ధోనీల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. మార్చి 26న ఐపీఎల్‌లో 4వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. 

‘మహీ భాయ్.. అన్నీ నీ దగ్గర్నుంచే నేర్చుకున్నా.. ఇప్పుడు నీకు పోటీగా ఆడేందుకు సిద్ధమవుతున్నా. వీవో ఐపీఎల్ లో కలుసుకుందాం. ఏమంటావ్.. ‘ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 

అందుకు ధీటుగా ధోనీ కూడా స్పందించి.. ‘నేను ఆడటం మొదలుపెట్టినప్పుడు ఇలాగే అనుకునేవాడిని. రా రిషబ్. వికెట్ వెనకాల నేనే ఉంటాగా చూసుకుందాం’ అని ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నానని చెప్పాడు. ఇలా ప్రచారంతోనే ఈ జట్ల మధ్య పోరుకు క్రేజ్ పెంచేయడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.