బీజేపీలో చేరాల్సిన సమయం వస్తే ఎవరు ఆపినా ఆగదు : టీఆర్ఎస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై టీఆర్ఎస్ నేత డీఎస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదు అని స్పష్టం చేశారు.

పార్టీ మార్పుపై టీఆర్ఎస్ నేత డీఎస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదు అని స్పష్టం చేశారు.
పార్టీ మార్పుపై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదు అని స్పష్టం చేశారు. బీజేపీలో చేరను అంటూనే.. కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగానే పార్టీ మారాల్సిన సమయం వస్తే ఎవరు ఆపినా ఆగదన్నారు. బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను పార్లమెంటులో మాత్రమే కలిశాను, బీజేపీ ఆఫీస్ లో కాదు అని డీఎస్ చెప్పారు. హోంమంత్రి కాబట్టే షా ని కలిశాను అని వెల్లడించారు. ప్రాంత సమస్యలపై ఎవరైనా, ఎవరినైనా కలవొచ్చు అని సమర్థించుకున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు తనపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసి ఏడాదిన్నర కాలం అయిపోందన్నారు. దీనిపై అధిష్టానం నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదన్నారు. భవిష్యత్తులో వస్తుందని అనుకోవడం లేదన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నికపైనా డీఎస్ స్పందించారు. హుజూర్ నగర్ లో డిఫరెంట్ రాజకీయం నడుస్తోందన్నారు. ఏ సమయంలో ఎలాంటి తీర్పు ఇవ్వాలో ఓటర్లకు తెలుసు అని చెప్పారు.
నా కొడుకు అరవింద్ కు అతడి సిద్ధాంతాలు అతడికి ఉంటాయి అని చెప్పారు. తప్పు చేస్తే తనపై చర్యలు తీసుకోవచ్చన్నారు. బీజేపీలో ఉన్న తన కుమారుడు ధర్మపురి అరవింద్‌కు రాజకీయంగా సహకరిస్తున్నారనే ఆరోపణలతో నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు కవితతో పాటు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి డీఎస్ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయబోనని గతంలోనే స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. దీంతో డీఎస్ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఆయన అమిత్ షాను కలవడం పార్టీ మార్పు ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. బీజేపీలో చేరిక గురించి డీఎస్ చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. అసలు డీఎస్ ఉద్దేశ్యం ఏంటి అని డిస్కస్ చేసుకుంటున్నారు.