గురజాల సభకు నో పర్మిషన్ : పోలీసుల నోటీసు తీసుకోని కన్నా

  • Published By: madhu ,Published On : September 16, 2019 / 03:56 AM IST
గురజాల సభకు నో పర్మిషన్ : పోలీసుల నోటీసు తీసుకోని కన్నా

Updated On : September 16, 2019 / 3:56 AM IST

గుంటూరు జిల్లా గురజాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిర్వహించతలపెట్టిన సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. సభకు వెళ్లేందుకు కన్నా లక్ష్మీనారాయణ సిద్ధమౌతున్నారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నోటీసు ఇచ్చేందుకు కన్నా నివాసానికి గురజాల సీఐ చేరుకున్నారు. అయితే..నోటీసులు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. గురజాలలో 144 సెక్షన్, పోలీసు 30 యాక్టు అమల్లో ఉందని..గురజాలకు రావొద్దని సూచించారు.

అయినా..వినిపించుకోకుండా కన్నా బయలుదేరారు. 144 సెక్షన్ నేపథ్యంలో సభకు అనుమతినివ్వలేదు పోలీసులు. మార్గమధ్యంలో కన్నాను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. వంద రోజుల పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. సీఎం జగన్ చెప్పేది ఒకటి..చేసేది ఒకటి అని విమర్శించారు. ఇలాంటి అసమర్థత ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదని, 

జగన్ వంద రోజుల పాలన, పల్నాడు ప్రాంతంలో ఇటీవలే జరిగిన రాజకీయ దాడులు, ప్రధానమైన సమస్యలపై ప్రభుత్వం విఫలం చెందిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ధర్నాలు, ఆందోళనలకు పిలుపునిచ్చింది ఆ పార్టీ. గతంలోనే కార్యక్రమ నిర్వహించాలని అనుకున్నా..వరదల కారణంగా పోస్ట్ పోన్డ్ అయ్యింది. 
Read More : YSR రైతు భరోసా : పథకానికి వీరు అనర్హులు