పోల్ డే : చిత్తూరులో మాక్ పోలింగ్ ఆలస్యం

ఏపీలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే…జిల్లాల్లో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయమే ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని ఈసీ అధికారులు సూచించినా..వారు చేరుకోలేదు. దీనితో మాక్ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఈవీఎంలు ఓపెన్ చేయలేదు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 10వ తేదీ బుధవారం అర్ధరాత్రి కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ గదిలో ఉన్న ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గదిలో మంటలు వ్యాపించాయి. 6 ల్యాప్ ట్యాప్‌లు దగ్ధమయ్యాయి. ఫర్నీచర్ కూడా కొంత కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
3800 పోలింగ్ కేంద్రాలు.
జిల్లాలో 31, 83, 187 మంది ఓటర్లు.
పురుషులు 15,77,116
మహిళలు 16,05,734ఠ
ఇతరులు 337
పార్లమెంట్ స్థానాలు 3
అసెంబ్లీ స్థానాలు 14
లోక్ సభకు బరిలో ఉన్న అభ్యర్థులు చిత్తూరు 8, రాజంపేట 9, తిరుపతి 10
అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్థులు 181
జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్