వైసీపీలో టెన్షన్: పాల్ రావాలి.. పాలన మారాలి

కామెడీ చేస్తున్నాడు… పోటీ ఏం చేస్తాడులే అనుకున్నారు అంతా.. రాజకీయ క్రీడలో అరటిపండు అంటూ ట్రోల్ చేశారు. అయితే 175స్థానాలలో అభ్యర్ధులను నిలబెట్టానని, తమకు వంద సీట్లకు పైగా వస్తాయని, ఏపీకి కాబోయే సీఎం తానేనంటూ ప్రచారం కూడా స్టార్ట్ చేసేశాడు పాల్.
Read Also : ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు : పవన్ కళ్యాణ్
పవన్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన పాల్ భీమవరంలో పోటీ చేయలేకపోయారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, ఆచంట నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన పాల్.. ఈ ఎన్నికల్లో తనకు ఓట్లేస్తే రూ.7లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ను అమెరికా చేస్తానంటూ హామీ ఇచ్చారు. పగిలిపోయే గ్లాస్, తుప్పుపట్టే సైకిల్, ఫ్యాన్ పార్టీలకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.
తాను సంపాదించిన రూ.3.5లక్షల కోట్లను ట్రస్టులకు ఇచ్చానని, తన పేరిట రూపాయి ఆస్తి లేదని అన్నారు. ‘పాల్ రావాలి.. పాలన మారాలి’ అనే నినాదంతో ప్రజాశాంతి పార్టీ ఎన్నికలకు వెళ్తుందని, జగన్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తుందని అన్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఓటేస్తే గాజు గ్లాస్ పగిలిపోతుందని, ఏపీ డెవలప్ కావాలంటే తానే సీఎం కావాలని అన్నారు.
Read Also : 100GBతో.. జియో ట్రిపుల్ ప్లే ప్లాన్!
ఇదిలా ఉంటే పాల్ చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లు కలిగిన వారికే సీట్లు కేటాయించారు. ఇది ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా తయారైంది. కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లకు.. అచ్చం అలాంటి పేర్లతో ఉండే అభ్యర్థులనే బరిలోకి దింపాడు పాల్. దీనికితోడు వైసీపీ గుర్తు ఫ్యాన్.. పాల్ గుర్తు హెలికాఫ్టర్.. ఈ విధంగానూ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కేఏ పాల్.
Read Also : డెడ్‌లైన్.. 4 రోజులే : పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా?