కామారెడ్డిలో కలకలం : రూ. 2కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 02:01 PM IST
కామారెడ్డిలో కలకలం : రూ. 2కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

కామారెడ్డిలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు కారులో మాదకద్రవ్యాలు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో సోదాలు చేశారు. వారి సోదాల్లో డ్రగ్స్ విషయం వెలుగుచూసింది. వాటి విలువ రూ.2.40కోట్లు ఉంటుందని తేల్చారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏకంగా రూ.2కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. పట్టుబడిన మత్తుపదార్థం ఆల్ప్రాజోలం అని అధికారులు తెలిపారు. ఇది చాలా డేంజర్ అని చెప్పారు. ఈ మత్తు మందు వాడిన వాళ్లు త్వరగా దానికి బానిసలవుతారని, నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వివరించారు.