వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో ఎన్నికల ఫలితాలు ఆలస్యం : ద్వివేది

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 11:48 AM IST
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో ఎన్నికల ఫలితాలు ఆలస్యం : ద్వివేది

Updated On : April 25, 2019 / 11:48 AM IST

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా తెలిసే అవకాశం ఉందని ఏపీ సీఈవో ద్వివేది అన్నారు. నియోజకవర్గానికి ఐదు బూత్ లలో వీవీప్యాట్ స్లిప్పులు, అసెంబ్లీ, లోక్ సభ పరిధిలో పది వీవీప్యాట్ లను లెక్కించాలని తెలిపారు. వీవీప్యాట్ ల కౌంటింగ్ బాధ్యత ఆర్వోలు, పరిశీలకులదేనని స్పష్టం చేశారు.

వీవీప్యాట్ కౌంటింగ్ ముగిసిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఓటర్ల సంఖ్యను బట్టి కొన్ని చోట్ల ఫలితాల వెల్లడి ఆలస్యం కావొచ్చన్నారు. వీవీప్యాట్ లెక్కల్లో తేడా ఉంటే ఆర్వో, అబ్జర్వర్ లు ఏం చేయాలో నిర్ణయిస్తారని తెలిపారు.