అమరావతి రైతులకు అండగా.. రాజధాని గ్రామాల్లో సతీ సమేతంగా చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజధాని రైతులకు అండగా.. ఇవాళ(01 జనవరి 2020) రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తన భార్య భువనేశ్వరితో కలిసి అమరావతి ప్రాంత పర్యటనకు సిద్ధమయ్యారు చంద్రబాబు. రైతులకు సంఘీభావంగా జనవరి 1న రైతుల మధ్య ఉండాలని.. వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో చంద్రబాబు దంపతులు పర్యటనలు చేస్తారు. ఇద్దరూ ధర్నాలో పాల్గొంటారు.
ఇప్పటికే రాజధాని రైతుల కోసం న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది తెలుగుదేశం పార్టీ. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. ఎవరూ బొకేలు, కేక్‌లు తీసుకురావొద్దని కోరారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఖర్చు చేసే డబ్బును అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీలకు విరాళం ఇవ్వాలని సూచించారు. అమరావతి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని.. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వేలాది రైతు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండగా చంద్రబాబు భార్య భువనేశ్వరితో కలిసి నేడు రాజధాని ప్రాంతంలో ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాల్లో పర్యటించనున్నారు. నేటికి అమరావతి రైతుల పోరాటం 15వ రోజుకు చేరుకోగా, తుళ్లూరులో మహాధర్నాను నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. వెలగపూడిలో 15వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. మరోవైపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.