అమరావతిలో 26వ రోజు రైతుల ఆందోళనలు : నేడు జాతీయ మహిళా కమిషన్ పర్యటన
రాజధాని తరలింపుపై ఏపీ రగిలిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.

రాజధాని తరలింపుపై ఏపీ రగిలిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
రాజధాని తరలింపుపై ఏపీ రగిలిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలతో 29 గ్రామాలు హోరెత్తుతున్నాయి. 26వరోజు కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేదీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. ఉద్దండరాయునిపాలెంలోను వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసనలు తెలుపుతున్నారు.
మరోవైపు… మహిళలపై జరిగిన లాఠీఛార్జ్ ఘటనపై నిజనిర్ధారణ కోసం అమరావతికి వచ్చిన జాతీయ మహిళా కమిషన్ బృందం ఇవాళ విచారణ జరపనుంది. కమిషన్ ప్రతినిధులు… ఇవాళ తుళ్లూరు, మందడంలో పర్యటించనుంది. రాజధాని ఉద్యమంలో మహిళలపై జరిగిన దాడి ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో మహిళా కమిషన్ బృందాన్ని కలవనున్నారు టీడీపీ నేతలు.
రాజధాని పేరుతో రాష్ట్రంలో దిగజారిపోతున్న పరిస్థితి చూస్తుంటే రక్తం మరిగిపోతోందంటున్న చంద్రబాబు…. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మచిలీపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతిలో యాత్ర నిర్వహించారు. రాజధాని కోసం జోలె పట్టారు. ఇవాళ గుంటూరు జిల్లా నరసరావుపేటలోజరిగే యాత్రలో పాల్గొననున్న బాబు… సాయంత్రం జోలెపట్టి విరాళాలు సేకరించనున్నారు. అనంతరం పల్నాడు బస్టాండ్‌లో తలపెట్టిన బహిరంగసభలో పాల్గొంటారు. దీంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు రెడీ అయ్యారు.