తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం

తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 8, 2019) బూందీపోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 09:06 AM IST
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం

Updated On : December 8, 2019 / 9:06 AM IST

తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 8, 2019) బూందీపోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

చిత్తూరు జిల్లాలోని తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 8, 2019) బూందీపోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో సహాయంతో మంటలను ఆర్పుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కొంతమేర మంటలు అదుపులోకి వచ్చాయి. 

సిబ్బందికి, పోటు కార్మికులకు ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు వ్యాపించిన వెంటనే అక్కడున్న సిబ్బంది, కార్మికులు బయటికి వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బూందీ పాడైపోయింది. అక్కడున్న కార్మికులందరూ భయంతో బయటికి పరుగులు తీశారు. పోటులో జరిగిన అగ్నిప్రమాదం వల్ల బూందీ ముడిసరుకులు పాడైపోయాయి. నెయ్యి, శనగ పండి పాడైపోయాయి. నష్ట తీవ్రతను అధికారులు అంచనా వేయాల్సివుంది. బూందీపోటులోకి ఎవరినీ అనుమతించడం లేదు.

బూందీపోటులో తరచుగా అగ్నిప్రమాదం జరుగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ అగ్నిప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. ఏడాదిన్నర క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. మళ్లీ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా టీటీడీ అన్ని చర్యలు చేపట్టింది. ఇవాళ శ్రీవారి బూందీపోటులో అగ్నిప్రమాదం జరుగడం కలకలం రేపింది. బూందీపోటులో అగ్ని ప్రమాదాలు జరుగకుండా శాస్త్రీయంగా చర్యలు తీసుకోవాలనుకున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.