ఫస్ట్ టైమ్ : నల్లచొక్కాలో చంద్రబాబు ఇలా ఉన్నారు

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 05:03 AM IST
ఫస్ట్ టైమ్ : నల్లచొక్కాలో చంద్రబాబు ఇలా ఉన్నారు

Updated On : February 1, 2019 / 5:03 AM IST

అమరావతి: కేంద్రంపై నిరసన వ్యక్తంచేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సారి నల్లచొక్కాతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఎప్పుడూ పసుపు చొక్కాలు, గోధుమ రంగు దుస్తుల్లో కనిపించే చంద్రబాబు ఎమ్మెల్యేలతో పాటు  నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో పలువురు నల్లచొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా.. కొందరు నల్లచొక్కా, నల్లప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రానికి వ్యతిరేకింగా ఏపీ ప్రభుత్వం నిరసన
ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు సీఎం కార్యచరణ ప్రకటించారు. విభజన చట్టం అమలులో కేంద్రం మొండి చేయి చూపిస్తున్నందుకు నిరసనగా ఫిబ్రవరి 1న నిరసన దినంగా పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలును నీరుగారుస్తున్న ప్రధాని మోదీ  వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఏపీ విషయంలో కేంద్రం సహకారం అందివ్వడంలో కేంద్రం వివక్ష చూపడానికి నిరసనగా ఎమ్మెల్యేలను నల్లదుస్తులు ధరించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.  

మరోవైపు పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మోడీ సర్కార్ తీరుకి వ్యతిరేకంగా  పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదురు నిలబడి నిరసన తెలియజేశారు.