విశాఖ చరిత్రలో తొలిసారి: బీచ్‌లో గణతంత్ర వేడుకలు

విశాఖ చరిత్రలోనే తొలిసారి గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ మేర ఏర్పాట్లను భారీ బందోబస్తుతో నిర్వహించనున్నారు. జనవరి 26న పరేడ్ చేయడం కోసం జనవరి 17నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. దీని కోసమే 17నుంచి 25వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5న్నర నుంచి 11గంటల వరకూ ను సాయంత్రం 3గంటల నుంచి 6గంటల వరకూ జరగనుంది.
సిటీ కమిషనర్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది విశాఖలో గణతంత్ర వేడుకలు జరుగుతుండటంతో ఏర్పాట్లు చేశాం. దీంతో పాటుగా సెక్యూరిటీ ఏర్పాట్లు, ట్రాఫిక్ అడ్జస్ట్ మెంట్లు చేశాం. నేవీ, సీఆర్పీఎఫ్, తెలంగాణ నుంచి ఓ బెటాలియన్, ఏపీ నుంచి ఓ బెటాలియన్, ఎక్సైజ్ బెటాలియన్ లు ఉంటాయి. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఎన్సీపీ బాయ్స్ అండ్ గర్ల్స్, రెడ్ క్రాస్, భారత్ స్కౌట్ అండ గర్ల్స్ లాంటి నిరాయుధ దళాలు పాల్గొంటాయి.
వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా గవర్నరు విచ్చేయనున్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ హాజరవుతారు. 10నుంచి 15వేల మంది హాజరుకావచ్చని అంచనా. 3వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఎయిర్‌పోర్టు నుంచి ఆర్కే బీచ్ వరకూ భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నాం అని నగర కమిషనర్ రాజీవ్ కుమార్ మీనన్ అన్నారు.