ప్రాణాలు తీసిన అతివేగం : కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 03:57 AM IST
ప్రాణాలు తీసిన అతివేగం : కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి

Updated On : January 4, 2020 / 3:57 AM IST

శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు.

గాయపడిన డ్రైవర్ ను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులంతా ఒడిశా రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో చంటిపాపతో పాటూ ఇద్దరు మహిళలు. విశాఖపట్నం సమీపంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో కారు బరంపూర్ వైపు కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిట్లుగా పోలీసులు గుర్తించారు. కాలువలోకి దూసుకెళ్లిన కారును క్రేన్ సహాయంతో బైటకు తీసారు.

కాలువలో పడి మృతి చెందినవారి మృతదేహాలను పోలీసులు బైటకు వెలికి తీస్తున్నారు. కారులో చిక్కుకుని చనిపోయినవారిని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్ కు  తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.