భద్రాచలం ఆంధ్రాదే.. తీసుకెళ్లిపోతా : చంద్రబాబు హెచ్చరిక
పోలవరం ప్రాజెక్టు విషయంలో భద్రాచలాన్ని అడ్డు పెట్టకుని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారనీ... ఇటువంటి కుట్రలు పన్నితే భధ్రాచలం కూడా ఏపీకే ఇవ్వాలని చంద్రగిరి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో భద్రాచలాన్ని అడ్డు పెట్టకుని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారనీ… ఇటువంటి కుట్రలు పన్నితే భధ్రాచలం కూడా ఏపీకే ఇవ్వాలని చంద్రగిరి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో భద్రాచలాన్ని అడ్డు పెట్టకుని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారనీ… ఇటువంటి కుట్రలు పన్నితే భధ్రాచలం కూడా ఏపీకే ఇవ్వాలని చంద్రగిరి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరం పూర్తవ్వకూడదనే కోపంతోనే.. సుప్రీంకోర్టులో కేసు వేశారని చెప్పుకొచ్చారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు కడితే భద్రచాలం మునిగిపోతుందని వంకలు పెడతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
Read Also : మోడీకి సిగ్గు.. లజ్జ లేదు.. అసమర్థుడు – బాబు ఘాటు వ్యాఖ్యలు
శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణకు ఇవ్వాలని..కృష్ణావాటర్ ట్రిబ్యునల్ లో కూడా కేసీఆర్ కేసు వేశారనీ.. అలాగే పోతిరెడ్డి పాడు, ముచ్చుమర్రి లను మూసేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని.. జగన్ కు పులివెందుల ప్రజలు భయపడుతున్నారన్నారు. జగన్ కు ఎదురు వెళితే చంపేస్తారని ప్రజలు భయపడుతున్నారన్నారు. పులివెందుల్లో కూడా జగన్ గెలవలేడని.. టీడీపీకే పులివెందుల ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తంచేశారు.
రౌడీయిజంతో ప్రజలను భయపెట్టి గెలవాలని జగన్ కుట్ర పన్నుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాయలసీమకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. చిత్తూరు జిల్లాను ఇండస్ట్రియల్ హబ్ గా తయారుచేస్తానని మాటిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకూడదని జగన్ కేసీఆర్ తో కలిసి కుట్రలు పన్నుతున్నాడని విమర్శించారు. పోలవరానికి అడ్డుపడితే ఎవ్వరినీ విడిచిపెట్టననీ..తప్పు చేసిన వారిని జైలుకు పంపించి తీరతానన్నారు చంద్రబాబు.
Read Also : చంద్రగిరిలో చంద్రబాబు : జగన్ మోటా రౌడీ చెవిరెడ్డి చోటా రౌడీ