రాజధానిపై రిపోర్ట్ : సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన జీఎన్ రావు రిపోర్టు.. సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(డిసెంబర్ 20,2019) మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన జీఎన్

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 10:45 AM IST
రాజధానిపై రిపోర్ట్ : సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ

Updated On : December 20, 2019 / 10:45 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన జీఎన్ రావు రిపోర్టు.. సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(డిసెంబర్ 20,2019) మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన జీఎన్

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన జీఎన్ రావు రిపోర్టు.. సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(డిసెంబర్ 20,2019) మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన జీఎన్ రావు కమిటీ సభ్యులు.. తమ నివేదికను సీఎం జగన్ కి అందచేశారు. అనంతరం జీఎన్ రావు కమిటీ సభ్యులు సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. నివేదికలోని అంశాలను జీఎన్ రావు కమిటీ సభ్యులు… సీఎంకు వివరిస్తున్నారు.

డిసెంబర్ 27న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం చర్చిస్తుందని సమాచారం. కేబినెట్ ఆమోదించిన తర్వాతే నివేదికను బహిర్గతం చేస్తారని వార్తలు వస్తున్నాయి. అసలు.. జీఎన్ రావు కమిటీ.. నివేదికలో ఏం చెప్పింది అనేది ఆసక్తికరంగా మారింది. అటు.. సీఎం జగన్ తుది నిర్ణయంపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

* రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశంపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ
* రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి అధ్యయనం
* ప్రజల అభిప్రాయాలు సేకరణ
* పలు ప్రాంతాల నుంచి 40వేలకు పైగా విజ్ఞప్తులు
* సీఎం జగన్ చేతికి జీఎన్ రావు కమిటీ నివేదిక
* డిసెంబర్ 27న కేబినెట్ భేటీలో నివేదికపై చర్చ
* కేబినెట్ ఆమోదం తర్వాత నివేదిక బహిర్గతం..?
* సీఎం జగన్ తుది నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
* మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా..?
* 2019 సెప్టెంబర్ 13న జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు