గుప్తనిధుల కోసం వెళ్లి ఒకరి మృతి..మరొకరు గల్లంతు

గుప్తనిధుల కోసం ఫారెస్ట్‌లోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి చనిపోయిన ఘటన ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం తాడివారిపల్లివద్ద వెలుగొండ సమీపంలో చోటుచేసుకుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్తనిధులున్నాయంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. ముగ్గురు యువకులు వాటి కోసం అడవిలోకి వెళ్లారు.
అయితే విపరీతమైన దాహంతో నీళ్ల కోసం ముగ్గురు వ్యక్తులు చెల్లాచెదురయ్యారు. వీరిలో శివకుమార్ అనే వ్యక్తి చనిపోగా.. కృష్ణ నాయక్ అనే వ్యక్తి అడవి నుంచి బయటకు వచ్చి.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పారిపోయాడు. దీంతో మరో యువకుడి బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో.. అతని కోసం గాలిస్తున్నారు.