జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం… ప్రమాదం అంచున కస్తూర్బాగాంధీ పాఠశాల బాలికలు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు చార్జింగ్ పెడుతుండగా పేలుడు సంభవించింది.

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు చార్జింగ్ పెడుతుండగా పేలుడు సంభవించింది.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు చార్జింగ్ పెడుతుండగా పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమీప గ్రామాల్లో పొగలు అలముకున్నాయి. మూడు గ్రామాలను పూర్తిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమీపంలో ఉన్న కస్తూర్భాగాంధీ బాలికల గురుకులంలోని విద్యార్థినీలు కూడా ప్రమాదం అంచులో ఉన్నారు. గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థుల చుట్టూ పొగ అలుముకోవడంతో అక్కడ ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, విద్యార్థినీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో రంగులు తయారు చేస్తారు. కిరోసిన్ కు బదులు టిన్నర్ కలిపి కలర్స్ తో ఉన్న డ్రమ్ములను నిల్వ ఉంచుతారు. నిల్వ ఉంచిన డ్రమ్ములు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. అక్కడున్న కార్మికులు రియాక్టర్లకు ఛార్జింగ్ పెడుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన నిప్పు రవ్వల వల్ల మంటలు చెలరేగాయి. ఇది భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. ఫ్యాక్టరీలోని రంగుల డ్రమ్ములన్ని పేలుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. టిన్నర్ కు సంబంధించిన డ్రమ్ములు పేలడంతో మంటలు మరింతగా ఎగిసిపడుతున్నాయి.
ఫ్యాక్టరీతో కస్తూర్బాగాంధీ గురకుల పాఠశాల, చుట్టు పక్కల గ్రామాలకు ప్రమాదం ఉందని టెన్ టివి గతంలోనే హెచ్చరింది. ఫ్యాక్టరీతో వచ్చే ప్రమాదంపై వరుస కథనాలను కూడా ప్రసారం చేసింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, గురకుల పాఠశాల విద్యార్థులు.. ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ కూడా స్పందించలేదు.
ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మూడు గ్రామాల ప్రజలు, పాఠశాల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ తయారు చేసిన రంగులను హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఫ్యాక్టరీలో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు. రక్షణ చర్యలు నామ మాత్రంగానే ఉండటంతోనే ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు.