విద్యార్ధినిలపై హిందీ టీచర్ వేధింపులు : సారీ చెప్పించి వదిలేసిన హెడ్ మాస్టర్

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 10:04 AM IST
విద్యార్ధినిలపై హిందీ టీచర్ వేధింపులు : సారీ చెప్పించి వదిలేసిన హెడ్ మాస్టర్

Updated On : December 20, 2019 / 10:04 AM IST

సూర్యాపేట హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ ప్రాథమిక స్కూల్ లో హిందీ టీచర్ విద్యార్ధినిలపై వేధింపులకు పాల్పడ్డాడు. తమతో హిందీ టీచర్ పీవీ సత్యానందం అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనీ హెడ్ మాస్టర్ కు విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. తను చెప్పినట్లుగా వినకపోతే పరీక్షల్లో మీరు బాగా రాసినా సున్నా మార్కులు వేస్తాననీ..ఈ విషయం ఎవరికైనా చెబితే స్కూల్ నుంచి సస్పెండ్ చేయిస్తానని బెదిరిస్తున్నాడనీ చిన్నారులు వాపోయారు.  

దీంతో సత్యానందాన్ని పిలిచి ప్రశ్నించగా..నాకేమీ తెలీదంటూ బుకాయించాడు. కాదు టీచర్ అబద్దం చెబుతున్నాడనీ దయచేసి తమ బాధను అర్థం చేసుకోమని హెడ్ మాస్టర్ని బాధిత చిన్నారులు  వేడుకున్నారు. దీంతో సత్యానందంతో విద్యార్ధినిలకు క్షమాపణ చెప్పించిన హెడ్ మాస్టర్..గ్రామపెద్దలు తమ పని అయిపోయిందని  చేతులు దులుపుకున్నాడు.

కానీ పిల్లల్ని వేధిస్తున్న టీచర్ పై చర్యలు తీసుకోవాలని సత్యానందాన్ని సస్పెండ్ చేయాలని విద్యార్థినిల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.