అనుమానం పెనుభూతం : భార్య చేతులు నరికేసాడు

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 06:41 AM IST
అనుమానం పెనుభూతం : భార్య చేతులు నరికేసాడు

Updated On : October 30, 2019 / 6:41 AM IST

కడప జిల్లా రైల్వే కోడూరు లక్ష్మీ గార్డెన్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త భార్య చేతులు నరికేశాడు. దీంతో తీవ్ర రక్త స్రావంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి తిరుపతిలోని రుయా హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.  

వివరాల్లోకి వెళితే..శివయ్య..పద్మావతి దంపతులు లక్ష్మీగార్డెన్ లో నివసిస్తున్నారు. గత పది రోజుల నుంచి ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పద్మావతి పుట్టింటికి వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయిన ఆమె తిరిగి అక్టోబర్ 29న ఇంటికి వచ్చింది. దీంతో తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లావంటూ భార్యతో గొడవకు దిగాడు శివయ్య. 

ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటలు పెరిగాయి. శివయ్య అపర ఆగ్రహంతో అక్కడే ఉన్న కత్తితో భార్య రెండు చేతులు నరికేశాడు. ఈ ఘటనలో పద్మావతి ఒక చేయి తెగిపోగా..రెండవ  చేయికి తీవ్రంగా గాయమైంది. వెంటనే స్పందించిన స్థానికులు సమీపంలోని హాస్పిటల్ తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతిలోని రుయా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం పద్మావతి చికిత్స పొందుతోంది.