మోడీ అబద్దాల కోరు..నిజాయితీ ఉందా – కేసీఆర్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

  • Published By: madhu ,Published On : April 2, 2019 / 12:36 PM IST
మోడీ అబద్దాల కోరు..నిజాయితీ ఉందా – కేసీఆర్

Updated On : April 2, 2019 / 12:36 PM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ. 35 వేల కోట్లు ఇచ్చిందని చెబుతున్నారని ఆయన తెలిపారు. అయితే..ఇక్కడ ఢిల్లీని సాకుతోంది..తమ రాష్ట్రమని..కేంద్రానికి పన్నుల రూపంలో లక్ష కోట్ల రూపాయలు వస్తోందన్నారు. మోడీ డ్రామా చేస్తున్నావా ? దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో కాంగ్రెస్..బీజేపీయేతర పార్టీలు రావాలని కేసీఆర్ అన్నారు. 
Read Also : తలసాని జోస్యం : బీజేపీకి 160, కాంగ్రెస్‌కు 75 ఎంపీ సీట్లు

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఏప్రిల్ 02వ తేదీ మంగళవారం వరంగల్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. తనకు ప్రధాన మంత్రి అయ్యే కోరిక లేదని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలు వస్తే పార్టీలు కాదు..ప్రజల అభీష్టం గెలవాలన్నారు. ఈ ఎన్నికల్లో కూడా TRS అగ్రభాగాన నిలుపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుందని, హక్కులు సాధించుకోవచ్చన్నారు.  

రాహుల్ గాంధీ..నరేంద్ర మోడీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని.. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లున్నాయి..3 లక్షల 44 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది..ఇంత వాడుతున్నామా ? ఏమి చేస్తున్నామో చెప్పాలని ప్రశ్నిస్తే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశ అవసరాల కోసం టీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సినవసరం ఉందని..కాంగ్రెస్..బీజేపీలకు చెందిన ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీకి గులాములు అవుతారన్నారు. దేశంలో సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు తప్పకుండా అధికారంలోకి వస్తాయని సర్వేలు పేర్కొంటున్నాయన్నారు. 
Read Also : కల సాకారం : భువనగిరి జిల్లాకు త్వరలో నీళ్లు