IAF సర్జికల్ స్ట్రైక్ : పాక్ పై ‘సెటైరికల్ స్ట్రైక్’తో నెటిజన్స్ జోక్స్ 

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 10:07 AM IST
IAF సర్జికల్ స్ట్రైక్ : పాక్ పై ‘సెటైరికల్ స్ట్రైక్’తో నెటిజన్స్ జోక్స్ 

Updated On : February 26, 2019 / 10:07 AM IST

జమ్ము కశ్మీర్ : భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ తో పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్ పైనా..పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారతీయులు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. భారత్ వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నారు.

భారత జవాన్లను మానవబాంబుతో పొట్టన పెట్టుకున్నవారికి ధీటైన సమాధానం చెప్పాలని దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుభికిక క్రమంలో మంగళవారం (ఫిబ్రవరి 26) తెల్లవారు ఝామున భారత వాయు సేన మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. పాక్ పై దెబ్బకు దెబ్బ తీసింది. దీంతో భారతీయులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తంచేస్తు..పాకిస్థాన్ పై జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. భారత  ఆర్మీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 
Also Read : హామీ ఇస్తున్నా : దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది

అక్కడితో ఊరుకోవటంలేదు పాకిస్థాన్‌ ఆర్మీని ఓ ఆటేడుసుకుంటున్నారు. జవాన్లు సర్జికల్ స్ట్రైక్‌తో పాక్‌కు బుద్ధి చెబుతుంటే..నెటిజన్లు మాత్రం ‘సెటైరికల్ స్ట్రైక్’తో నవ్వులు పూయిస్తున్నారు. పులితో ఆటలాడితే ఇట్టాగే ఉంటుందంటూ జోకులేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ 2.0పై సోషల్ మీడియా పోస్టులు మనం కూడా ఓ లుక్కేద్దాం..

Also Read : మెరుపుదాడులపై బాలీవుడ్ స్పందన ఏంటంటే?