రాహుల్ హామీ : ఏడాదిలోనే 22లక్షల ఉద్యోగాలు భ‌ర్తీ

మోడీ పాలనలో నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2019 / 12:06 PM IST
రాహుల్ హామీ : ఏడాదిలోనే 22లక్షల ఉద్యోగాలు భ‌ర్తీ

Updated On : April 1, 2019 / 12:06 PM IST

మోడీ పాలనలో నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

మోడీ పాలనలో నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(ఏప్రిల్-1,2019)తెలంగాణ రాష్ట్రంలోని నల్గగొండ జిల్లాలోని హుజూర్ నగర్ లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ… మోడీ పాలనలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు.
Read Also : 687 కాంగ్రెస్ ఫేస్ బుక్ పేజీలు డిలీట్

నిరుద్యోగ యువకులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే పర్మీషన్ తీసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువకులు పర్మీషన్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు.

దేశవ్యాప్తంగా 22లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని..అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.మార్చి-2020వరకు ఖాళీగా ఉన్న 22లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఏడాదిలోనే భర్తీ చేస్తామని రాహుల్ తెలిపారు.
Read Also : పవన్ హామీలు : స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్.. ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం