లోకేష్ పప్పు..పప్పు : జయంతికి..వర్ధంతికి తేడా తెల్వదు – షర్మిల

ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ని టార్గెట్ చేశారు జగన్ సోదరి షర్మిల. లోకేష్‌పై పంచ్ డైలాగ్‌లు విసురుతూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

  • Published By: madhu ,Published On : March 30, 2019 / 07:14 AM IST
లోకేష్ పప్పు..పప్పు : జయంతికి..వర్ధంతికి తేడా తెల్వదు – షర్మిల

Updated On : March 30, 2019 / 7:14 AM IST

ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ని టార్గెట్ చేశారు జగన్ సోదరి షర్మిల. లోకేష్‌పై పంచ్ డైలాగ్‌లు విసురుతూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ని టార్గెట్ చేశారు జగన్ సోదరి షర్మిల. లోకేష్‌పై పంచ్ డైలాగ్‌లు విసురుతూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ పప్పు..పప్పు అంటూ అభివర్ణించారు. ఎన్నికల్లో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల ప్రచారంలోకి దిగారు. వైసీపీ అభ్యర్థుల తరపున ఆమె సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.

మార్చి 30వ తేదీన గుంటూరు జిల్లాలో ఆమె ప్రచారం నిర్వహించి లోకేష్‌పై విమర్శలు చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి..లోకేష్‌కి మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నారని…ఈ పప్పు గారికి కనీసం జయంతి..వర్ధంతికి మధ్య తేడా తెలియదు..పప్పు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు..అయినా ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చొన్నాడు..ఈ మంత్రిని బాబు జనాల మీదకు రుద్దాడు.. అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. 
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ కామెంట్లు

బాబుపై కూడా పలు విమర్శలు చేశారు. మహిళలను బాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని..ఎంగిలి వేస్తే సరిపోదని మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి మహిళలు అందర్నీ వంచించాడన్నారు ఆమె. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా ప్రతి తల్లికి..తండ్రికి అన్యాయం చేశాడు బాబు అంటూ తెలిపారు. మాట మీద నిలబడని సీఎం బాబు అవసరమా అంటూ షర్మిల ప్రశ్నించారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 2500 వేల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. అయినా ఐదేళ్ల కాలంలో ఒక్క బిల్డింగ్ కట్టలేదని..మరో సారి ఛాన్స్ ఇస్తే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని బాబు అంటున్నారని..ఏమైనా చెవిలో పువ్వులున్నాయా బాబు..అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి. 
Read Also : Social Media లో YCP : ట్రెండింగ్‌లో రావాలి జగన్..సాంగ్