జగన్‌కు పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే

జనసేన పార్టీ నుంచి 2019ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. అయితే వీలు చిక్కినప్పుడల్లా జగన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్న రాపాక పలు సమయాల్లో జగన్‌పై అసెంబ్లీలోనే ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సంధర్భంగా పాలాభిషేకం చేశారు.
రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ఎన్నికలకు ముందు వైసీపీలో సీటు దక్కకపోవడంతో పవన్ కళ్యాణ్‌ను కలిసి పార్టీలో చేరారు. రాజోలులో అప్పటికే.. కొంత మంది జనసేన కోసం పని చేస్తున్నప్పటికీ.. వారిని కాదని మాజీ ఎమ్మెల్యే కాస్త అనుభవం ఉన్న కారణంగా రాపాకకు టిక్కెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
అయితే జనసేన నాయకులకు షాక్ ఇస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాస్త ఇబ్బంది పెడుతున్నాయి ఆ పార్టీ నాయకులను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు బాగున్నాయని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రశంసించారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజల ఆశీస్సులుంటాయని, మేనిఫెస్టోలో లేనివి కూడా జగన్ అమలు చేస్తున్నారని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి చేనేత సొసైటీలో నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవంలో మాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ అమ్మాజీతో పాటు వరప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పుట్టిన రోజు కేక్‌ను అమ్మాజీ కట్ చేశారు. సీఎం ఫ్లెక్సీకి ఎమ్మెల్యే వరప్రసాదరావు పాలాభిషేకం ఇచ్చారు.