అభివృద్ధి జరగలేదు : భీమవరంలో పవన్ నామినేషన్

  • Published By: madhu ,Published On : March 22, 2019 / 11:02 AM IST
అభివృద్ధి జరగలేదు : భీమవరంలో పవన్ నామినేషన్

Updated On : March 22, 2019 / 11:02 AM IST

2014లో భీమవరం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో తాను టీడీపీకి సపోర్టు ఇస్తే తాను ఆశించినంత అభివృద్ధి జరగలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న జనసేన..2019 ఎన్నికల్లో పవన్ 2 నియోజకవర్గాల నుండి బరిలో నిలుస్తున్నారు.
Read Also : కాంగ్రెస్‌కు చిత్తరంజన్ దాస్ గుడ్ బై

ఒకటి గాజువాక కాగా..రెండోది భీమవరం. ఇప్పటికే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన పవన్..మార్చి 22వ తేదీ శుక్రవారం భీమవరం నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ..అభివృద్ధి కాకపోవడంతోనే తాను ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు పవన్ తెలిపారు.

తాను నిర్వహించిన పోరాటయాత్ర సందర్భంగా ఇక్కడ డంప్ యార్డు చూస్తే ప్రజాప్రతినిధులు ఏ మేరకు పనిచేస్తున్నారో అర్థం అయ్యిందన్నారు. టిడిపికి సపోర్టు చేసినా..అభివృద్ధి ఫలితాలు చూడలేదన్నారు. అత్యంత తక్కువ వ్యవధిలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీనిచ్చారు. నరసాపురం ఎంపీగా నాగబాబును దించుతున్నట్లు ప్రజలు ఆయన్ని గెలిపిస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. తన నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావడం ఆనందంగా ఉందన్నారు పవన్. 
Read Also : చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి