అవగాహన కోసం : పిల్లల కోసం ట్రాఫిక్ పార్కు

  • Published By: madhu ,Published On : September 29, 2019 / 05:56 AM IST
అవగాహన కోసం : పిల్లల కోసం ట్రాఫిక్ పార్కు

Updated On : September 29, 2019 / 5:56 AM IST

చిన్నతనంలోనే ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో… కరీంనగర్‌ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చిల్డ్రన్‌ పార్కు రూపుదిద్దుకుంది. ప్రత్యేకంగా పిల్లల కోసమే దీన్ని నిర్మించారు. రోడ్ ప్రమాదాలను నివారించాలని ఉద్దేశ్యంతో…  చిన్నప్పటి నుండి పిల్లలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించడానికి తెలంగాణ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు ఎకరాల స్థలం లో పార్క్ నిర్మాణం పూర్తయింది.. నాలుగేళ్ల కిందట పార్క్ పనులు మొదలు పెట్టి అత్యాధునిక హంగులతో  సుందరంగా పార్క్ ను తీర్చి దిద్దారు.

మంత్రి కేటీఆర్‌ ఆలోచనతో ఈ పార్క్ నిర్మాణం జరిగింది.. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య వేలల్లో ఉండటానికి ప్రధానంగా ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన లేకపోవడమేనని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడి, చిన్నతనం నుంచే అవగాహన కల్పిస్తే  బాగుంటుందని రవాణా శాఖ అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ సబ్‌ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. దీంతో తెలంగాణ మోటార్‌ వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అసోసియేషన్‌ చిల్డ్రన్‌ పార్కు నిర్మాణం చేయాలని  ప్రతిపాదించారు. కరీంనగర్‌లో స్థలం అనుకూలంగా ఉండటంతో నాలుగేళ్ల క్రితం అంకురార్పణ చేశారు. 

చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కులో రోడ్ సిగ్నల్స్… లెవల్ క్రాసింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్, పెట్రోల్ బంక్, స్కూల్ జోన్, హాస్పిటల్ జోన్, మార్కెట్ జోన్, ట్రాఫిక్ ఐలాండ్, జీబ్రా క్రాసింగ్, రైల్వే ట్రాక్ వంటి వాటిని ఏర్పాటు చేశారు. పార్క్ లోకి వచ్చిన పిల్లలను  ముందుగా ఆడిటోరియంలో కి తీసుకు వెళ్లి. ట్రాఫిక్ నిబంధనల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తామంటున్న.. డిప్యూటీ కమిషనర్ పాపారావు వెల్లడించారు. ఇలాంటి చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కులు విదేశాల్లో ఉన్నా.. భారత దేశంలో మాత్రం ఇది మొదటిది.. మంత్రి కేటీఆర్ ఆలోచనతో ఆధునిక హంగులతో పార్కు నిర్మాణం జరిగింది. 
Read More : కిప్‌ ఇట్ అప్‌ : నాసా యాత్రకు ఏపీ విద్యార్థిని