చేపల చెరువుగా మారిపోయిన ‘లగ్జరీ స్విమ్మింగ్ పూల్’…!!

  • Published By: nagamani ,Published On : August 31, 2020 / 05:16 PM IST
చేపల చెరువుగా మారిపోయిన ‘లగ్జరీ స్విమ్మింగ్ పూల్’…!!

Updated On : August 31, 2020 / 5:36 PM IST

కేరళ అంటే భూతల స్వర్గమే. ప్రకృతి మాత ఒడిలాంటి కేరళలో రిసార్ట్స్ సంగతి చెప్పనక్కర్లేదు. చూపు తిప్పుకోనివ్వవు. డబ్బులుండాలే గానీ స్వర్గమే భూమిపైకి దిగివచ్చిందా? అన్నట్లుగా ఉంటాయి. అక్కడి స్విమ్మింగ్ పూల్స్ గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. అటువంటి ఓ ప్రముఖ రిసార్ట్‌‌లోని ఖరీదైన లగ్జరీ స్విమ్మింగ్ ఇప్పుడు తన రూపు రేఖలే మార్చేసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో ఆ లగ్జరీ పూల్ ‘చేపల చెరువు’లా మారిపోయింది. అదేంటీ.. కస్టమర్ల కోసం ఇదో వెరైటీ ప్రయత్నం అయిఉంటుందనుకునేరు..కానీ కాదండీ బాబూ ‘కరోనా దెబ్బ’ టూరిస్టులు లేరు..ఆదారం లేదు..కానీ మెయింటినెన్స్ తప్పదు.

దీంతో నష్టాలు మామూలుగా లేవు..కస్టమర్లు లేక దమ్మిడి ఆదాయంలేక ఇటువంటి దుస్థితి నెలకొంది. అందమైన సోయగాలతో సుందరీమణులు చేపపిల్లల్లా ఈదులాడీ ఈ లగ్జరీ స్విమ్మింగ్ పూల్ కాస్తా.. చేపల చెరువుగా మారిపోయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితతో ఇలా చేపలచెరువైపోయింది. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్నట్లుగా..కరోనా చించుకుంటే పూల్ కాస్తా చేపలచెరువై కూర్చుంది..

కరోనా దెబ్బకు చిన్నపిల్లల అల్లరితో కళకళలాడే స్కూల్స్ కోళ్లపారంలా మారిపోయాయి. టీచర్లు వీధిన పడ్డారు. కోర్టులు మూసేటయంతో లాయర్లు రోడ్డున పడ్డారు. టెలీఫోన్ బూత్ లు కాఫీ సెంటర్లుగా మారిపోయి కష్టమర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇలా కరోనా ప్రజల జీవితాల్లోనే వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు..

అటువంటిదే కేరళలోని కుమారకామ్‌లో గల అవేదా రిసార్ట్ అంట్ స్పా.. లాక్‌డౌన్ తో మార్చి నుంచి మూసే ఉంది. అప్పటి నుంచి రిసార్ట్ యాజమాన్యం ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు..బిల్లులు కట్టటానికి నానా పాట్లు పడుతోంది. దీంతో ఇలాగైతే కుదరదనుకుంది. దీంతో ఈ రిసార్టులో ఉన్న 7.5 మిలియన్ లీటర్ల లగ్జరీ స్విమ్మింగ్ పూల్‌ను చేపల చెరువులా మార్చేసింది.

ఈ దారుణ దుస్థితిపై రిసార్ట్స్ లోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు సురేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ వల్ల ఆదాయం మొత్తం పడిపోయింది. పైసా ఆదాయం లేదు. వేరే దారిలేక జూన్ నుంచి రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్‌ను చేపల చెరువులా మార్చేశాం. ఈ స్విమ్మింగ్ పూల్‌లో నాలుగు మిలియన్ టన్నుల చేపలను పెంచేందకు వీలుగా ఉందని సురేంద్రన్ తెలిపారు.

మొత్తం చేపలను మిడిల్ ఈస్ట్‌కు ఎగుమతి చయడం ద్వారా 40 వేల డాలర్లు (రూ.2,990,892) ఆదాయం వస్తుందని..దీనివల్ల తమ ఉద్యోగులు కూడా పని దొరుకుతుందని..కాస్త వెలుసుబాటుతో కాస్త ఆదాయంతో సిబ్బంది జీతాలకు ఇబ్బంది ఉండదనీ..పైగా ఈ లాక్ డౌన్ తో పనేమీ కష్టమర్లు లేకపోవటంతో వేరే పనులేమీ లేక..ఈ చేపల చెరువుపై వచ్చే ఆదాయంతో వారికి పని ఉన్నట్లుంటుంది. జీతాలు, మెయింటెనెన్స్ బిల్లులు కట్టడం సాధ్యమవుతుందని తెలిపారు.ఈ పూల్ లో పీరల్ స్పాట్ చేప పిల్లలను వేశాం. అవి నవంబరు నెల కల్లా పెద్దవి అవుతాయి. వాటిని మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేయాలనేది ప్లాన్ అని తెలిపారు.