స్థల వివాదం : మహిళల్ని జుట్టు పట్టుకుని ఈడ్చేస్తూ దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ వర్గం మహిళలపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ లాగి పడేశారు. ఇష్టమొచ్చినట్లుగా ఈడ్చేస్తు దాడి చేశారు.
అశ్వారావు పేటలోని వెంకటదుర్గా థియేటర్ పక్కన నివాసం ఉంటున్న మేడవరపు రమాదేవి, హరనాథ్ రావులకు చెందిన ఓ భూమిని భాస్కర రావు అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా పేపర్స్ చూపించటంతో వివాదం తలెత్తింది. దీంతో ఆ స్థలం మాదంటే మాదంటూ ఇరు వర్గాలు దాడికి దిగాయి. ఈ క్రమంలో రమాదేవి..ఆమె కోడలిపై భాస్కర రావు వర్గం దాడికి దిగారు. మహిళలని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు జుట్టు పట్టుకుని ఈడ్చేస్తూ దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు.
ఈ విషయంపై రమాదేవి..ఆమె కోడలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా తమ గోడును ఎవరూ పట్టించుకోవటంలేదంటూ బాధిత మహిళలిద్దరూ వాపోతున్నారు. అంతేకాకుండా పోలీసులు తమనే వేధిస్తున్నారని అంటున్నారు.