స్టేజీపైనే మంత్రికి హెయిర్ కట్టింగ్ చేసిన బార్బర్..రూ.60వేలు ఇచ్చిషాపు పెట్టుకోమన్న మంత్రి

ఓ కార్యక్రమానికి హాజరైన ఓ మంత్రిగారికి స్టేజీ మీదనే కూర్చోపెట్టి హెయిర్ కట్టింగ్ చేశాడు ఓ బార్బర్. తనకు చక్కగా హెయిర్ కట్టింగ్ చేసి..నున్నగా షేవింగ్ కూడా చేసిన ఆ బార్డర్ కు సదరు మంత్రివర్యులు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.60వేలు ఇచ్చి షాపు పెట్టుకోమని చెప్పారు. దీంతో ఆ బార్డర్ తనతో మంత్రి హెయిర్ కట్టింగ్ చేయించుకోవటమే గొప్పగా ఫీలవుతుండా 60వేలు ఇవ్వటంతో అతని ఆందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది.
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పరిస్థితుల్లో చాలామంది ప్రజాప్రతినిథులు కార్యక్రమాలకు హాజరుకావటానికి కూడా భయపడుతున్నారు. కానీ మధ్యప్రదేశ్ ఫారెస్ట్ మంత్రి విజయ్ షా మాత్రం ఖండ్వా జిల్లా గులైమాల్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంట్లో భాగంగా మంత్రి విజయ్ షా స్టేజీమీద కూర్చున్నారు. స్థానిక పరిస్థితుల గురించి అక్కడి నేతలతో మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో అక్కడికి వచ్చిన రోహిదాస్ అనే వ్యక్తి తాను సెలూన్ పెట్టుకోవడానికి సాయం చేయాలని మంత్రిని కోరాడు. వెంటనే మంత్రి విజయ్ షా ‘‘షాపు పెట్టుకుంటావా? నేను సహాయం చేయాలా? అయితే నువ్వు హెయిర్ కట్టింగ్ ఎలా చేస్తావో చూస్తాను..నాకు హెయిర్ కట్టింగ్..షేవింగ్ చేస్తావా? అని నవ్వుతూ స్టేజీపైకి పిలిచారు.
వెంటనే రోహిదాస్ చేతులకు శానిటైజర్ రాసుకొని..ఫేస్‌మాస్క్ ధరించి జాగ్రత్తగా మంత్రిగారికి హెయిర్ కట్టింగ్..షేవింగ్ చేశాడు. పనిపూర్తయ్యాక..మంత్రిగారు అద్దంలో చూసుకుంటూ బాగా చేశావోయ్..అంటూ మెచ్చుకున్నారు. తరువాత బార్బర్ రోహిదాస్ కు రూ.60వేలు ఇచ్చి షాపు పెట్టుకోవోయ్…అంటూ చెప్పారు. దీంతో రోహిదాస్ ఆనందపడిపోయాడు.
https://10tv.in/kangana-ranaut-episode-dgca-unimpressed-by-indigos-reply-seeks-further-probe/
ఈ సందర్భంగా మంత్రి విజయ్ షా మాట్లాడుతూ.. కరోనా కారణంగా చాలా మంది సెలూన్‌కు రావడం లేదని..దీంతో బార్బర్లు పనిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారనీ..అందుకే వారిలో భరోసా కల్పించేందుకు తాను అందరి ముందే కటింగ్ చేయించుకున్నానని తెలిపారు. జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి సమస్య రాదని అన్నారు. కానీ జాగ్రత్తలు పాటించటం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే కరోనా మహమ్మారిని నియంత్రించవచ్చని సూచించారు.
కరోనా వచ్చిన తర్వాత చాలా మంది సెలూన్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎందుకైనా మంచిదని కొంతమంది ఇంట్లోనే సొంతంగా కటింగ్ చేసుకుంటున్నారు. మరికొందరు హెయిర్ ను గడ్డాలను పెంచుకునే తిరుగుతున్నవిషయం తెలిసిందే.