కాల్‌మనీ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య : మరణానికి వారే కారణమంటూ సెల్ఫీ వీడియో
విజయవాడలో కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ కారణం అంటూ సెల్ఫీ వీడియో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయవాడలో కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ కారణం అంటూ సెల్ఫీ వీడియో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు.
విజయవాడలో కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ కారణం అంటూ సెల్ఫీ వీడియో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు. 4 లక్షల రూపాయలకు గాను 16 లక్షలు కట్టానంటూ సెల్ఫీ వీడియోలో ప్రేమ్ చెప్పాడు.
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించాడు. పోలీసుల ముందే నలుగురూ తనను కులం పేరుతో దూషించారని ఆరోపించాడు. ప్రేమ్ మరణానికి కారమైన నలుగురిపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రంగారావు దగ్గర తీసుకున్న డబ్బులకు పది రూపాయల వడ్డీ చొప్పున మొత్తం చెల్లించినా…చెల్లించలేదంటున్నారని వాపోయారు.
తాను తీసుకున్న రూ. 6 లక్షలకు 16 లక్షలు వేసి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. తాను తీసుకున్న ప్రతి లక్షకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున వడ్డీ చెల్లించానని తెలిపారు. కావాలంటే తన స్నేహితులను ఎంక్వైరీ చేయండన్నారు. రంగారావు వినియోగిస్తున్న ఫ్రిజ్, టీవీ తనదేనని అన్నారు. ఇద్దరు మహిళలతో రంగారావు వివాహేతర సంబంధం ఉందన్నారు.
రంగారావు ఇచ్చిన చెక్కులతో కిరణ్, రాంబాబు తనను చంపేస్తున్నారు..తనకు బతకాలని ఉంది. పిల్లలను మంచిగా చేయాలని ఉంది కానీ బతకనివ్వడం లేదు. తన వల్ల జ్యోతి, మంగరాజు మామయ్య సారీ అని చెప్పాడు. ఏసీపీ, డీసీపీ న్యాయం చేస్తా అన్నాడు కానీ రంగారావు బయటి వాళ్లను కొనేస్తున్నారని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.