డిష్యూం డిష్యూం : మఠంపల్లి ఎంపీడీవో, సూపరింటెండెంట్‌లపై దాడి

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 11:38 AM IST
డిష్యూం డిష్యూం : మఠంపల్లి ఎంపీడీవో, సూపరింటెండెంట్‌లపై దాడి

నల్గొండ : మఠంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీడీవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తిలపై మాజీ ఎంపీపీ అంజమ్మ, ఆమె భర్త ఒక్కసారిగా దాడి చేశారు. ఈ అనూహ్యపరిణామంతో ఏం జరుగుతోందో అక్కడ అర్థం కాలేదు. వెంటనే అక్కడున్న వారు తేరుకుని దాడిని అడ్డుకున్నారు. 

దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పోలీస్ స్టేషన్‌లో అంజమ్మ దంపతులపై వారు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉద్యోగ సంఘాలు రాస్తారోకో చేపట్టాయి. తమకు సంబంధం లేని వాటిని అంటగట్టడం…దాడి చేయడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 

కొన్ని రోజుల క్రితం అవిశ్వాస పరీక్షలో అంజమ్మ పదవి కోల్పోయారు. అవిశ్వాసానికి ఎంపీడీవో, సూపరింటెండెంట్ కారణమంటూ అంజమ్మ దంపతులు భావించి ఈ దాడికి పాల్పడ్డారు.