కలకలం : బెజవాడలో లాకప్ డెత్
బెజవాడలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కలకలం రేపుతోంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు.

బెజవాడలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కలకలం రేపుతోంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు.
బెజవాడలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కలకలం రేపుతోంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. వారి స్టైల్లో విచారించారు. అయితే..ఏప్రిల్ 16వ తేదీ ఉదయం అతను లేవలేదు. పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని మృతుడి ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. దీనినుండి ఎలా బయటపడాలనే దానిపై పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్
దొంగతనం కేసులో ఓ వ్యక్తిని సింగ్‌నగర్ పీఎస్‌కు తీసుకొచ్చారు పోలీసులు. ఏప్రిల్ 15వ తేదీ నుండి ఇతడిని విచారిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం ఆ వ్యక్తి లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని అతని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. దొంగతనం చేయలేదని ఎంత మొత్తుకున్నా..పోలీసులు వినిపించుకోలేదని వారు వెల్లడిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి