మంత్రి మానవత్వం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు సమీపంలోని దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింలు అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు గాయపడి రోడ్డుపై పడిపోయాడు. సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి సబిత.. ప్రమాదాన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపారు. 108 కి కాల్ చేశారు. గాయపడిన వ్యక్తిని 108లోకి ఎక్కించారు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి చెప్పారు.
ఆపదలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న మంత్రి సబితను గ్రామస్తులు ప్రశంసించారు. మంత్రి చొరవను అభినందించారు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడారని మెచ్చుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇతరుల్లో స్ఫూర్తి నింపుతాయని అంటున్నారు.