వీడొక టీచరేనా : మైనర్‌పై వికృత చేష్టలు

  • Published By: madhu ,Published On : January 21, 2019 / 06:05 AM IST
వీడొక టీచరేనా :  మైనర్‌పై వికృత చేష్టలు

ప్రకాశం : చదువు చెప్పండయ్యా..అంటే..వికృత చేష్టలకు పాల్పడుతున్నారు టీచర్లు. విద్యార్థినిలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తున్నారు. తాజాగా విద్యార్థినిని టీచర్ లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన ఇంకొల్లులోని ఎమ్.ఆర్.ఆర్ ప్రకాశం స్కూల్‌‌లో చోటు చేసుకుంది. పదో తరగతి పాస్ చేపిస్తానని బాలికను టీచర్ వీరయ్య లొంగదీసుకున్నాడు. ఇటీవలే ఇంటికి వెళ్లిన ఆ బాలిక తిరిగి స్కూల్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. దీనితో తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించారు. జనవరి 20వ తేదీ రాత్రి నుండి జనవరి 21వ తేదీ సోమవారం వరకు ఆందోళన కొనసాగిస్తున్నారు. ముందే గ్రహించిన వీరయ్య పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్‌కి చేరుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్ వీరయ్యపై నిర్భయతో పాటు పలు కేసులను నమోదు చేశారు.