చేతకాని ప్రభుత్వానికి నిధులు ఎందుకు అనుకున్నారేమో?

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. పనులన్నీ ఆపేసి కూర్చున్న చేతకాని ప్రభుత్వానికి నిధులిచ్చి ఏం లాభమని అనుకున్నారేమో.. ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదంటూ లోకేష్ ఘూటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మెడలు వంచుతాం అని ఏ పరదాల చాటు ప్రభుత్వంలోని పెద్దలు దాక్కున్నారని అన్నారు.
కేసుల భయంతో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టి రాష్ట్రానికి మొండిచేయి అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలలో ఒక్కసారైనా మా ఏపీకి ఇది ఇవ్వండి అని అడిగే సాహసం చేసారా? గెలిచాం అని చెప్పుకోవడం కాదు, గెలిచి ఏం సాధించారో చెప్పండంటూ ప్రశ్నించారు లోకేష్.
పనులన్నీ ఆపేసుకు కూర్చున్న చేతకాని ప్రభుత్వానికి నిధులిచ్చి ఏం లాభంలే అనుకున్నారేమో! అందుకే కేంద్రం ఏపీకి బడ్జెట్ కేటాయింపులు చేయలేదని, కేంద్రం మెడలు వంచేస్తాం అన్న మొనగాళ్ళు ఏ పరదాల చాటున చేతులు కట్టుకు నిల్చున్నారో! అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసుల భయంతో అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ఇక్కడ మాత్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించారు అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. 8 నెలలలో ఒక్కసారైనా మా ఏపీకి ఇది ఇవ్వండి అని అడిగే సాహసం చేసారా? గెలిచాం అని చెప్పుకోవడం కాదు, గెలిచి ఏం సాధించారో చెప్పండి. (2/2)
— Lokesh Nara (@naralokesh) February 1, 2020