సెల్ఫీ వద్దన్నందుకు సారీ..న్యూజిలాండ్ ప్రధాని జెసిండా

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో న్యూజిలాండ్ ప్రపంచ దేశాలను ఆకర్షిచింది. దేశ ప్రధాని జెసిండా కరోనా నిబంధనలు పాటించటంపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పించేవారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య అతి త్వరగా తగ్గిపోయాయి. కోరల నుంచి న్యూజిలాంట్ చాలా త్వరగా బైటపడింది. దీంతో న్యూజిలాండ్ లో ప్రధాని జెసిండా కరోనా ఆంక్షలను సడిలించారు. పూర్తిగా ముగించారు. కానీ ఎందుకైనా మంచిది..ప్రజలు సాధ్యమైనంతగా సామాజిక దూరం పాటించాలని సూచించారు.
ఈ క్రమంలో జెసిండా నార్త్ పామర్స్టన్ లో పర్యటిస్తున్న సందర్భంగా కొంతమంది అభిమానులు ఆమెను సెల్ఫీ అడిగారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా ఆంక్షలు సడలించినప్పటికీ సామాజిక దూరం పాటించకుండా ఇలా సెల్ఫీలు అంటూ నిబంధనలు పాటించకపోవటం మంచిది కాదని సూచించారు.
కాగా జెసిండా ఎక్కువగా తన అభిమానులతో సెల్ఫీలు దిగుతుంటారు. దీంతో ఆమె పామర్స్టన్ పర్యటనలో ఆమె అభిమానులు వచ్చి సెల్ఫీ కోరగా…ఆమె అంగీకరించలేదు. కానీ ఈ కరోనా కాలంలో సెల్ఫీ పేరుతో సామాజిక నిబంధనలు భంగం కలుగుతుందని దయచేసి ఇటువంటివి వద్దని కోరారు.
ప్రజల్లో ఇంకా కరోనా భయం ఉంది ఇటువంటి సమయంలో సెల్ఫీలు మంచిది కాదని..సెల్ఫీ వద్దనీ ..ప్రజలు దయచేసి ఈ పరిస్థితులను అర్థం చేసుకోవాలని జెసిండా కోరారు. ప్రతీ ఒక్కరూ కనీసం 1.5 మీటర్ల దూరం పాటించాలని కోరారు. సెల్ఫీ తీసుకుంటే సామాజిక దూరం ఎలా ఉంటుందో అనే విషయంపై ఆమె ఓ సెల్ఫీ ఫోటోను తీసి చూపించారు.సెల్ఫీ పేరుతో ఇటువంటి పొరపాటులు చేయవద్దని ఆమె కోరారు.