జగన్ దాడి : శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 07:25 AM IST
జగన్ దాడి : శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

విజయవాడ : జగన్‌పై జరిగిన కత్తి దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆయనపై దాడి చేసిన శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని ఎన్ఐఏ అధికారులు జనవరి 18వ తేదీ శుక్రవారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాదనలు విన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు హాట్ హాట్ కామెంట్స్ చేశాడు. జైలులో ఉన్న సమయంలో తాను 22 పేజీల బుక్‌ని రాసినట్లు..ఈ బుక్‌ని జైలు అధికారులు లాక్కొని ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపాడు. తన భావాలను ప్రజలకు తెలియచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయపరంగా తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు. 
ఇదిలా ఉంటే ఈ విషయంలో ఆల్ రెడీ ఎంక్వయిరీ చేసినట్లు..పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. కేవలం మూడు పేజీలు మాత్రమే రాసుకున్నాడని వాదించారు. 
నిందితుల తరపున పలువురు పిటిషన్‌లు దాఖలు చేశారని…అతనికి ప్రాణభయం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారని న్యాయవాది టెన్‌టివికి తెలిపారు. నోరు విప్పితే తన కుటుంబానికి ప్రమాదం ఎదురవుతుందని శ్రీనివాసరావు భయపడుతున్నాడని..అతనికి ఏదైనా జరిగితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అని మరో లాయర్ పేర్కొన్నారు.