నో బ్యాలెట్ పేపర్..M-3 ఈవీఎం : నిజామాబాద్ రైతుల బిక్షాటన
పార్లమెంట్ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది నిజామాబాద్. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో... కడుపు మండిన రైతులు నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచి ప్రధాన పార్టీలకే గుబులు పుట్టించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది నిజామాబాద్. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో… కడుపు మండిన రైతులు నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచి ప్రధాన పార్టీలకే గుబులు పుట్టించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది నిజామాబాద్. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో… కడుపు మండిన రైతులు నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచి ప్రధాన పార్టీలకే గుబులు పుట్టించారు. 185మంది పోటీలో ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు తెర లేచింది. ఓట్లు చీలుతాయేమో అని పార్టీల నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే బ్యాలెట్ పేపర్ వాడాలా ? ఈవీఎంలు వాడాలా అనే సందిగ్ధంలో ఉంది ఈసీ. చివరకు M-3 రకం ఈవీఎంలు వాడాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.
Read Also : జగన్ 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు : మోహన్ బాబు
ఎలక్షన్ కమిషన్ తీరుపై మండిపడ్డారు నిజామాబాద్ జిల్లా రైతులు. ఈవీఎం ఉపయోగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 01వ తేదీన నిజామాబాద్ ఎన్నికల బరిలో నిల్చిన రైతులు భిక్షాటన చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఎన్నిక కోసం పేపర్ బ్యాలెట్ వాడాలని.. అల్ఫాబెటిక్ ఆర్డర్‌లో పేర్లు పొందుపర్చాలని డిమాండ్ చేశారు.
మొత్తం 185మంది పోటీలో ఉండటంతో… ఎన్నిక నిర్వహణ కోసం ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటిపైనా ఈసీ కసరత్తు చేసింది. ఒకానొక సమయంలో బ్యాలెట్ పేపర్‌తో ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ చివరకు జంబో ఈవీఎంలకే జై కొట్టింది. M-3 రకం ఈవీఎంలు వాడాలని ఈసీ నిర్ణయించింది. వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL, హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL సంయుక్తంగా తయారుచేశాయి. 384 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా సరే.. ఓటింగ్ నిర్వహించడం చాలా ఈజీ.
Read Also : మోహన్ బాబు ఊసరవెల్లి : పారితోషికం ఎంత అందింది – బుద్ధా వెంకన్న