అయోధ్య మసీదు శంకుస్థాపనకు వెళ్తారా?అంటే యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్పారంటే..

  • Published By: nagamani ,Published On : August 6, 2020 / 10:22 AM IST
అయోధ్య మసీదు శంకుస్థాపనకు వెళ్తారా?అంటే యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్పారంటే..

Updated On : August 6, 2020 / 11:20 AM IST

దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణానికి భూమిపూజ ఎంతో ఆనందోత్సాల మధ్య సజావుగా జరిగిపోయింది. ఇక రామమందిర నిర్మాణం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఎంతోమంది ప్రజలు. ఈ చారిత్రాత్మక శుభకార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు, యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.



దేశ అత్యున్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవటం భూమిపూజ్ కూడా జరిగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇక ముస్లిం దేవాలయం మసీద్ నిర్మాణం కూడా అయోధ్యలో త్వరలో జరగనుంది. రామమందిరి నిర్మాణ భూమిపూజా కార్యక్రమానికి కొంతమంది ముస్లిం సోదరులకు కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలో అయోధ్యలో జరగబోయే మసీదు శంకుస్థాపనకు హిందువులకు ఆహ్వానం అందుతుందా లేదా? అనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయంపై యూపీ సీఎం యోగీను మసీద్ శంకుస్థాపనకు మీరు వెళ్తారా? అని మీడియా ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు..

‘‘మసీదు శంకుస్థాపనకు తనను ఎవరూ పిలవరని..తనను పిలవనప్పుడు తాను ఎలా వెళ్తానని ప్రశ్నించారు. నా పనిని ఒక కర్తవ్యంగా, ధర్మంగా భావిస్తానని..అన్ని మతాల ప్రజలు శాంతిసామరస్యాలతో కలిసి, మెలిసి బతకాలని తాను కోరుకుంటానని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మసీదు నిర్మాణానికి భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మసీదు నిర్మాణ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.



5 ఎకరాల భూమిని అయోధ్యలోని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. అయోధ్యకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నిపూర్ తాలూకాలోని సోహావాల్ వద్ద మసీదు కోసం ఫిబ్రవరి 5 న యుపి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుపై ఐదు ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మసీదు నిర్మాణ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.