ఓట్లు వేయలేదని ఇళ్లపై దాడులు

యలమంద : పంచాయితీ ఎన్నికల్లో తమకు ఓటు వేయకపోవటం వల్లనే ఓడిపోయామనే ఆక్రోశంతో నల్గొండ జిల్లా చందంపేట మండలం యలమంద గ్రామ శివారు చేపల గేటు వాసులపై కాంగ్రెస్ కార్యకర్తలు.. టీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్ళపై దాడుకులకు పాల్పడ్డారు. యలమంద గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి కేతావత్ నెహ్రూ నాయక్ విజయం సాధించారు. దీంతో తమకు ఓట్లు వేయలేదని కక్షతో పలువురు ఇళ్లపై దాడులకు పాల్పడుతున్న ఘటనలో చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌కు ఓటేయలేదని ఇళ్ళపై రాళ్లతో దాడి చేసి ఫర్నీచర్, టీవీలను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు గ్రామాలలో నెలకొన్న పరిస్థితుల రీత్యా రంగంలోకి దిగిన పోలీసులు 10మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.