72 గంటల్లో పెన్షన్, రేషన్ కార్డు – సీఎం జగన్ 

  • Published By: madhu ,Published On : October 2, 2019 / 07:15 AM IST
72 గంటల్లో పెన్షన్, రేషన్ కార్డు – సీఎం జగన్ 

Updated On : October 2, 2019 / 7:15 AM IST

చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం ఉండదు..లంచం ఇవ్వాల్సిన పరిస్థితి రాకూడదు..కేవలం రెండు..మూడు నెలలు మాత్రమే సమయం అడుగుతున్నాం..డిసెంబర్ నాటికి పూర్తిగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం..జనవరి 01 నుంచి అర్హత ఉన్న అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు సీఎం జగన్. ఫించన్..రేషన్ కార్డు..ఇలా..కొన్ని సేవలు కేవలం 72 గంటల్లోనే అందిస్తామని హామీనిచ్చారు. 

తూర్పుగోదావరి జిల్లాలో కరపలో గ్రామ సచివాలయాల పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వం చూసిన తప్పులను తమ ప్రభుత్వం చేయవద్దనే సూచనతో కొత్త కొత్త వ్యవస్థలు తీసుకరావడం జరుగుతోందన్నారు. గ్రామ సచివాలయం పక్కనే నిర్మించబడే షాపులో ప్రభుత్వం ధృవీకరించబడిన నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, వితన్తాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ దుకాణం పక్కనే వర్క్ షాపు ఉంటుందని..ఇందులో వ్యవసాయంలో జరిగే మార్పులపై శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు.

ఆక్వా రంగానికి సంబంధించిన వర్క్ షాపు ఉంటుందని..అక్కడ కూడా ఫెస్టిలైజర్స్..ఇతరత్రా ఉంటాయన్నారు. గ్రామాలను మార్చివేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. వివక్షకు తావు లేకుండా నియమకాలు చేపట్టినట్లు, 500 సేవలను ప్రతి పేదవాడికి సచివాలయ వ్యవస్థ నుంచి అందించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామ వాలంటీర్‌‌కు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతోందని..పారదర్శకంగా..అవినీతి అన్న పదానికి దూరంగా పెడుతూ..సేవలను అందిస్తారని సీఎం జగన్ వెల్లడించారు. 
Read More : ఇదొక రికార్డు : తూర్పుగోదావరిలో 44 వేల 198 మందికి జాబ్స్ – సీఎం జగన్