కిరాతకం : పట్టపగలు..నడిరోడ్డుపై వెంటపడి నరికేశాడు

పట్టపగలు..నడి రోడ్డుపై ఓ మనిషి ప్రాణాన్ని నిలువునా తీసేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 05:22 AM IST
కిరాతకం : పట్టపగలు..నడిరోడ్డుపై వెంటపడి నరికేశాడు

Updated On : March 29, 2019 / 5:22 AM IST

పట్టపగలు..నడి రోడ్డుపై ఓ మనిషి ప్రాణాన్ని నిలువునా తీసేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది.

చీరాల : పట్టపగలు..నడి రోడ్డుపై ఓ మనిషి ప్రాణాన్ని నిలువునా తీసేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటుచేసుకుంది. సభ్యసమాజంలో అత్యంత అమానవీయంగా జరిగిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చీరాలలోని ఆంధ్రకేసరి కాలేజీ వద్ద ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో చుట్టుపక్కల వారు షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకుని గట్టిగా కేకలు వేయటంతో దుండగుడు పరారయ్యాడు.
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

ఈ దాడితో తీవ్ర రక్తస్రావం కావటంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు..రక్తపు మడుగులో పడివున్న మాణిక్యాలరావును ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్ర రక్తస్రావం కావటంతో  బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సదరు బాదితుడు మాణిక్యాలరావుగా గుర్తించిన  పోలీసులు…ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష