ప్రధానికి బాబు నిరసన లేఖ: ఎన్‌ఐఏ చట్టానికి వ్యతిరేకం

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 08:44 AM IST
ప్రధానికి బాబు నిరసన లేఖ: ఎన్‌ఐఏ చట్టానికి వ్యతిరేకం

అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  5 పేజీల లేఖ రాశారు. వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్‌పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు సరికాదని..కేంద్ర ప్రభత్వం  వ్యవహరించిన తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2008లో ఎన్‌ఐఏ చట్టాన్ని మోదీ వ్యతిరేకించారని..ఇప్పుడదే చట్టాన్ని అనుసరిస్తూ జగన్‌పై దాడి కేసును ఆ సంస్థకు అప్పగించారని  లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.  ఎన్‌ఐఏ చట్టంపై మోదీ ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారన్నారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే కేసులను మాత్రమే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని..వ్యక్తిగత దాడి కేసును కూడా ఎన్‌ఐఏకు అప్పగించడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.