ఎన్నికల నిర్వహణకు సిద్ధం : సీఈవో ద్వివేది
ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు.

ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు.
ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు. రేపు కొన్ని పోలింగ్ బూత్ లకు ఈవీఎంలను తరలిస్తామన్నారు. ఎల్లుండి మిగిలిన పోలింగ్ బూత్ లకు ఈవీఎంలను తరలిస్తామని చెప్పారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.
రాయలసీమలో ఫ్యాక్షన్ కు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. కోస్తాంధ్రలోనూ కొన్ని ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు మోహరిస్తామని చెప్పారు. సెంట్రల్ ఫోర్స్ తో పాటు ప్రత్యేక బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పెద్దమొత్తంలో మద్యం, డబ్బులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.110 కోట్ల వరకు సీజ్ చేశామని తెలిపారు.
Read Also : తెలంగాణలో మైకులు మూగబోయాయి
రానున్న రెండు రోజుల్లో తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పారు. సోషల్ మీడియా సెంటర్ పెట్టామన్నారు. 1900 వరకు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 1400 ఫిర్యాదులపై నోటిసులు ఇచ్చామని తెలిపారు. గతం కంటే ఈసారి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎన్నికలపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం సులువైన పని కాదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వదంతులపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. గత ఎన్నికల్లో 78 శాతం పోలింగ్ జరిగిందని.. గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం పెంచడానికి ప్రచారం చేశామన్నారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. జనరల్ ఓటర్ల కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని కోరుతున్నానని తెలిపారు. నియోజకవర్గాలకు సంబంధంలేని వ్యక్తులు ఉండొద్దన్నారు. ప్రస్తుతం 15 లక్షల ఈవీఎంలు అవసరముందన్నారు. ఏజెంట్లను ఉదయం 6 గంటలకు పోలింగ్ కేంద్రాలకు పంపించాలని అభ్యర్థులకు సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లలో వీడియో రికార్డింగ్ ఉంటుందని తెలిపారు.
ఏప్రిల్ 11న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 వేల 186 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3 కోట్ల 93 లక్షల 45 వేల 7 వందల 17 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. కోటి 94 లక్షల 62 వేల 3 వందల 39 మంది పరుషు ఓటర్లు, కోటి 98 లక్షల 79 వేల 4 వందల 21 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఏపిలో ఎన్నికల కోసం 46 వేల 3 వందల 94 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Read Also : ఏపీలో మైక్ లు బంద్…ఓటరు దేవుడు ఎవరివైపు