APలో రాష్ట్రపతి పాలన విధించాలి – సి.రామచంద్రయ్య

  • Published By: madhu ,Published On : April 16, 2019 / 09:15 AM IST
APలో రాష్ట్రపతి పాలన విధించాలి – సి.రామచంద్రయ్య

Updated On : April 16, 2019 / 9:15 AM IST

ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి. ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. వైసీపీ నేత సి.రామచంద్రయ్య మాత్రం ఒక అడుగు ముందుకు వేశారు. ఏపీ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి..దీనికి రాష్ట్రపతి పాలన బెటర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్ర చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోనే ప్రయత్నంలో రికార్డులను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పాలన విధిస్తే ఇలాంటి ప్రయత్నాలకు చెక్ పెట్టవచ్చని సి.రామచంద్రయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. 
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్