ఏపీ పర్యటనపై మోడీ ట్వీట్: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో స్పందించారు. ఏపీలో తనది రెండో పర్యటన అని…ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తాను నమ్ముతున్నానన్నారు. ఏపీ ప్రజలు టీడీపీ అవినీతి, కుటుంబ రాజకీయలను కోరుకోవటంలేదనీ..ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా మోడీ తెలిపారు. రాజమండ్రి సభలో ఈ విషయాలను మాట్లాడతానని ప్రతీ అంశాన్నీ ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలిపే ప్రధాని నరేంద్రమోడీ ఏపీలో తన రెండో పర్యటనపై మోడీ ఇలా స్పందించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు (ఏప్రిల్ 1) తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై మోడీ ప్రసంగించనున్నారు.
ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదు. ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకుంటున్నారు. @BJP4Andhra
— Chowkidar Narendra Modi (@narendramodi) April 1, 2019