‘ఆశ్రయ్’ కొత్త మెడికల్ ఐసోలేషన్ బెడ్స్..

కరోనా సోకిన బాధితులను ఐసోలేషన్ కు తరలించి చికిత్సనందిస్తుంటారు. ఈ వార్డుల్లో రోగులందరిని ఒకే వార్డులో కొంత దూరం దూరంగా బెడ్స్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల కరోనా నుంచి త్వరగా కోలుకునే వారు కూడా పక్కనే ఉన్న రోగుల కారణంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది.
ఇటువంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు పూణేలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కొత్త రకం బెడ్లు తయారు చేసింది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండేలా మెడికల్ ఐసోలేషన్ బెడ్‌ను రూపొందించింది. ఈ బెడ్స్ చూసినవారంతా వెరీ గుడ్ ఐడియా అంటున్నారు.
ఈ కొత్త మెడికల్ బెడ్స్ ఏడున్నర అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు తయారు చేశారు. పక్కనుండే పేషెంట్ వైరస్ పక్కవారికి సోకకుండా ఆ బెడ్ చుట్టూ ప్లాస్టిక్ కర్డెన్స్ ఏర్పాటు చేశారు. ‘ఆశ్రయ్’ పేరుతో తయారైన ఈ బెడ్స్ శానిటైజ్ చేయటం కూడా చాలా ఈజీ. చిన్న గుడారంలా ఉన్న ఈ బెడ్స్ పక్కనే ఓ టేబుల్, ఓ కుర్చీ కూడా వేసుకొని హాయిగా ఉండే సౌకర్యాన్ని కూడా కల్పించారు.
హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో కరోనా రోగులకు ఈ మెడికల్ బెడ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా..ఈ మెడికల్ బెడ్ ధర కూడా తక్కువే ఉంటుందని తెలిపారు. ఈ బెడ్స్ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.