శ్రావణి హత్య కేసు : నిందితుల సమాచారం తెలిస్తే 94906 17111 కాల్ చేయండి

యాదాద్రి భువనగిరి..బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

  • Published By: madhu ,Published On : April 27, 2019 / 08:18 AM IST
శ్రావణి హత్య కేసు : నిందితుల సమాచారం తెలిస్తే 94906 17111 కాల్ చేయండి

Updated On : May 28, 2020 / 3:40 PM IST

యాదాద్రి భువనగిరి..బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

యాదాద్రి భువనగిరి..బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినట్లు..వీరు దర్యాప్తు స్టార్ట్ చేశారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలియచేశారు. గ్రామస్తుల వద్ద ఏదైనా సమాచారం ఉంటే శాఖకు చెందిన వాట్సప్ 94906 17111 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. హాజీపూర్‌‌లో శ్రావణి మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టెన్tvకి సీపీ మహేష్ భగవత్ తెలియచేశారు. 
Also Read : విద్యార్థిని శ్రావణి మర్డర్ : అట్టుడుకుతున్న హాజీపూర్

మిస్సింగ్ కేసు నమోదైనట్లు తనకు కంప్లయింట్ రావడంతో బోన్ గిరి డీసీపికి సమాచారం అందివ్వడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం సాయంత్రం సమయంలో బావిలో శవమై ఉందని తెలిసిందన్నారు. వెంటనే అక్కడకు చేరుకుని బావిలో ఉన్న డెడ్ బాడీని తమ సిబ్బంది పైకి తీసుకరావడం జరిగిందన్నారు. స్థానిక ఎస్ఐ వెంకటేష్ నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు చెప్పడంతో అతడిని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు, నివేదిక రాగానే వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఘటనలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుండి ఎలాంటి సమాచారం రాలేదని..తెలిసిన వ్యక్తి హస్తం ఉందా అనే దానిపై క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నామన్నారు. విశాఖ, ఒడిశా బోర్డర్ నుండి గంజాయి బయటకు వెళుతోందని, దీనిపై పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు. 

మరోవైపు తమకు న్యాయం చేయాలని హాజీపూర్ జాతీయ రహదారిపై శ్రావణి తల్లిదండ్రులు, గ్రామస్తులు బైఠాయించారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలను నిలిచిపోయాయి. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని..న్యాయం చేస్తామని..నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీనిచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. 
Also Read : శ్రావణి హత్య కేసు : బొమ్మలరామారం SI పై వేటు