రాహుల్ హామీ : బ్యాంకు ఖాతాలో రూ.72వేలు
విజయవాడ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే, తనను ప్రధాని చేస్తే పేదల బ్యాంకు ఖాతాల్లో ప్రతి ఏటా రూ.72వేలు

విజయవాడ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే, తనను ప్రధాని చేస్తే పేదల బ్యాంకు ఖాతాల్లో ప్రతి ఏటా రూ.72వేలు
విజయవాడ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే, తనను ప్రధాని చేస్తే పేదల బ్యాంకు ఖాతాల్లో ప్రతి ఏటా రూ.72వేలు వేస్తానని చెప్పారు. దేశంలో 20శాతం మంది పేదలు ఉన్నారని చెప్పిన రాహుల్, వారి ఖాతాల్లో డబ్బు వేస్తామన్నారు. పేదరికంపై యుద్ధం చేస్తామన్న రాహుల్, పేదరిక నిర్మూలన కోసం కనీస ఆదాయ పథకం తీసుకొస్తున్నామన్నారు. 25కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారని చెప్పారు. ఈ స్కీమ్ కింద ప్రతి నెల రూ.6వేలు బ్యాంకు అకౌంట్ లో వేస్తామన్నారు. తాను ప్రధాని మోడీలా అబద్దాలు చెప్పనని.. చెప్పింది చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు.
Read Also : ఓటు, పోలింగ్ బూత్ క్షణాల్లో తెలుసుకోవచ్చు : కొత్త ఆప్షన్స్‌తో ”నా ఓటు యాప్”
ప్రధాని మోడీపై రాహుల్ మండిపడ్డారు. ఐదేళ్లు పాలించిన మోడీ.. ఏపీకి ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలుపై ఏపీలోని ప్రాంతీయ పార్టీలు ప్రధానిపై ఒత్తిడి చెయ్యలేదని రాహుల్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోడీ మోసం చేశారని మండిపడ్డారు. పేదల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోడీ అబద్దం చెప్పారని అన్నారు. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగం లేకుండా చేస్తామని ప్రకటించారు.
15మంది శ్రీమంతులకు దేశ సంపదను మోడీ దోచి పెట్టారని రాహుల్ ఆరోపించారు. మోడీ ప్రధాని అయ్యాక ఒక్కటిగా ఉన్న దేశాన్ని ధనికుల దేశం, పేదల దేశంగా విభజించారని మండిపడ్డారు. ఆర్థిక నేరస్తులు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ దేశం నుంచి పారిపోవడానికి ప్రధాని సహకరించారని ఫైర్ అయ్యారు. రైతులు, కార్మికులపై మోడీ యుద్ధం చేస్తే.. మేం పేదరికంపై యుద్ధం చేస్తామన్నారు.
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం